Election Commission: ఏపీలో ఏప్రిల్ నుంచి ‘సర్’!
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:34 AM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్-సర్)ను ఏప్రిల్-మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా
న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక ఓటర్ల జాబితా విస్తృత సవరణ (ఎస్‌ఐఆర్-సర్)ను ఏప్రిల్-మే నెలల్లో పూర్తి చేస్తామని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణను విజయవంతంగా పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించిన తర్వాత.. రెండో దశను 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అండమాన్, లక్షదీవుల్లో ఈ ప్రక్రియ తుది అంకంలో ఉంది. మూడో దశ ‘సర్’ ఏపీ, తెలంగాణతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో జరుగుతుందని ఈసీ వర్గాలు తెలిపాయి.