Share News

ఏపీలో ఎన్‌సీసీ డైరెక్టరేట్‌

ABN , Publish Date - Jun 16 , 2026 | 03:48 AM

యువతకు సాధికారతను కల్పించడం, నేషనల్‌ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)లో చేరికలను పెంచేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌లలో స్వతంత్రంగా..

ఏపీలో ఎన్‌సీసీ డైరెక్టరేట్‌

  • కొత్తగా జార్ఖండ్‌లోనూ ఏర్పాటుకు నిర్ణయం

  • దేశంలో 19కి చేరనున్న ఎన్‌సీసీ డైరెక్టరేట్లు

న్యూఢిల్లీ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): యువతకు సాధికారతను కల్పించడం, నేషనల్‌ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)లో చేరికలను పెంచేందుకుగాను ఆంధ్రప్రదేశ్‌, జార్ఖండ్‌లలో స్వతంత్రంగా పనిచేసే రెండు కొత్త డైరెక్టరేట్ల ఏర్పాటుకు ఆ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో ఎన్‌సీసీ డైరెక్టరేట్ల సంఖ్య 17 నుంచి 19కి చేరనుంది. దీనివల్ల కేడెట్లకూ, విద్యాసంస్థలకూ ఎన్‌సీసీ మరింత చేరువవుతుంది. ఎన్‌సీసీని 1948లో 20 వేల కేడెట్లతో మొదలుపెట్టారు. ప్రస్తుతం 20 లక్షలకు పైగా యువ కేడెట్లతో, ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థగా పేరు తెచ్చుకుంది.

Updated Date - Jun 16 , 2026 | 03:48 AM