‘ప్రైవేటు’లో 66శాతం సిజేరియన్లే!
ABN , Publish Date - May 30 , 2026 | 05:15 AM
ఏపీలో కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, మహిళా సాధికారత అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ....
ఏపీలో ఇంటర్నెట్ వాడే మహిళలు 63శాతం
32 శాతం మంది మహిళలకు ఇళ్లు, భూములు
కుటుంబ నిర్ణయాల్లో మహిళలు 84 శాతం
మద్యం సేవిస్తున్న పురుషులు 23 శాతమే!
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర అంశాలు
న్యూఢిల్లీ, మే 29(ఆంధ్రజ్యోతి): ఏపీలో కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, మహిళా సాధికారత అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) 2023-24 నివేదికలో ఈ మేరకు పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య, సామాజిక సూచికల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
జనాభా, కుటుంబ వివరాలు:
రాష్ట్ర జనాభాలో ఐదేళ్ల లోపు పిల్లలు 6.9 శాతం ఉన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలు 21.1శాతం ఉన్నారు.
60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు 13.9 శాతం కాగా, గ్రామీణ ప్రాంతంలో వీరు 14.7 శాతం. పట్టణాల్లో వీరు 12.3 శాతం.
రాష్ట్రంలో 99.7శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది.
97.6శాతం కుటుంబాలకు తాగునీటి సౌకర్యం ఉంది.
ఏదో ఒక ఆరోగ్య బీమా లేదా ఫైనాన్సింగ్ పథకం వర్తించే కుటుంబాలు 91.9శాతానికి పెరిగాయి.
31.9 శాతం మంది మహిళలు తమ పేరు మీద లేదా ఉమ్మడిగా ఇల్లు, భూమిని కలిగి ఉన్నారు. ఇది గ్రామీణ మహిళల్లో 36.4శాతంగా ఉంది.
ఇంటర్నెట్‌ను వినియోగించే మహిళలు 21 శాతం నుంచి 63.6శాతంగా, గ్రామీణంలో58.3 శాతంగా ఉంది.
వివాహం, సంతానోత్పత్తి:
20-24 ఏళ్ల మహిళల్లో 18 ఏళ్లలోపే పెళ్లయిన వారి శాతం 29.3 నుంచి 25.1 శాతానికి తగ్గింది.
సంతానోత్పత్తి రేటు(ఒక మహిళకు సగటున 1.8గా నమోదైంది. గతంలో 1.7 టీఎఎఫ్ఆర్ ఉంది.
69.5శాతం కుటుంబ నియంత్రణ చేయించుకున్నారు.
18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 22.7 శాతం మంది గృహహింసను ఎదుర్కొంటున్నారు.
84శాతం మహిళలు నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నారు.
తల్లి, శిశు ఆరోగ్యం:
98.4శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు 52.2శాతంగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 66.2 శాతం, ప్రభుత్వ ఆస్పత్రులలో 38శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి.
12-23 నెలల వయసున్న పిల్లల్లో 87.7 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు వేశారు.
పిల్లల పోషకాహార స్థితి:
5 ఏళ్ల లోపు పిల్లలలో 24.6 శాతం మందిలో వయస్సుకు తగ్గ ఎదుగుదల లేదు.
5 ఏళ్ల లోపు పిల్లలలో ఎత్తుకు తగ్గ బరువులో లేనివారు 12.3శాతం
5 ఏళ్ల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ బరువులేనివారు 23.2శాతం
ఆరోగ్యం:
15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 21.8 శాతం అధిక మధుమేహంతో బాధపడుత ూ మందులు తీసుకుంటున్నారు. పురుషుల్లో 24.1శాతం ఉన్నారు. అధిక రక్తపోటుతో 24.1శాతం మంది మహిళలు బాధపడుతున్నారు. పురుషులు 26 శాతం ఉన్నారు.