Share News

4 రోజుల నష్టాలకు తెర

ABN , Publish Date - Sep 05 , 2026 | 03:45 AM

భారత స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది.

4 రోజుల నష్టాలకు తెర
Mubai Stock ExChange

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 362.57 పాయింట్ల లాభంతో 76,515.43 వద్దకు చేరింది. నిఫ్టీ 24.25 పాయింట్లు పెరిగి 23,897.70 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగా ఇన్వెస్టర్లు మెటల్‌, ఆయిల్‌, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరపడం ఇందుకు దోహదపడింది

Updated Date - Sep 05 , 2026 | 04:23 AM