Amrit Bharat Express: ఏసీ లేని అమృత్ భారత్ రైళ్లు
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:26 AM
తెలుగు రాష్ట్రాల పేద, మధ్య తరగతి వర్గాలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ఏసీ క్లాస్ లేకుండా స్లీపర్, సెకండ్‌క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉండే రెండు...
హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా రెండు రైళ్లు
23న కేరళలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ సిటీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల పేద, మధ్య తరగతి వర్గాలకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. ఏసీ క్లాస్ లేకుండా స్లీపర్, సెకండ్‌క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉండే రెండు అమృత్‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఇందులో ఒకటి చర్లపల్లి- నాగర్‌కోయిల్ మధ్య, మరొకటి హైదరాబాద్-తిరువనంతపురం మధ్య నడవనున్నాయి. చర్లపల్లి-నాగర్‌కోయిల్ రైలు గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి, మదురై మీదుగా నాగర్‌కోయిల్ వెళ్తుంది. హైదరాబాద్-తిరువనంతపురం అమృత్‌భారత్ విజయవాడ, ఒంగోలు, తిరుపతి, సేలం, కోయంబత్తూరు, త్రిశూర్ మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లను ప్రధాని మోదీ ఈ నెల 23న కేరళ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.