అమితాబ్ బంగ్లాకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:39 AM
మహారాష్ట్రలోని ముంబై, పుణె నగరాల్లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, ముంబై..
ముంబై ఎయిర్‌పోర్ట్, మేయర్ కార్యాలయం... బ్యాంకులు, కోర్టులకు సైతం హెచ్చరికలు
ముంబయి, పుణె, నవంబరు12: మహారాష్ట్రలోని ముంబై, పుణె నగరాల్లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’, ముంబై విమానాశ్రయం, మేయర్ కార్యాలయం, బ్యాంకులు, న్యాయస్థానాలతో పాటు పుణె మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేస్తామంటూ గురువారం ఈ-మెయిళ్లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని ప్రాథమికంగా నిర్థారించారు. కాగా ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ కార్యాలయం, దక్షిణ ముంబయిలోని జవేరీ బజార్ శాఖ, కొలాబాలోని లోకల్ క్రెమ్ బ్రాంచ్‌కు గురువారం ఉదయం 10.52 గంటలకు ఈ-మెయిల్ సందేశం అందింది. మధ్యాహ్నం 1.11 గంటలకు పీఎన్‌బీ శాఖలో బాంబు పేలుడు సంభవిస్తుందని అందులో హెచ్చరించారు. బెదిరింపు సందేశాల్లో ఖలిస్థాన్ ఉద్యమానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.