అమితాబ్, అభిషేక్‌లను చంపేస్తాం..!
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:40 AM
అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ హెచ్చరించాడు. తన ఇద్దరు అనుచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని..
ఏ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలూ వారిని కాపాడలేవు
సిక్కు వ్యతిరేకుల అంతు చూస్తాం: గోల్డీ ధిల్లాన్
ముంబై, నవంబరు 16: అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ హెచ్చరించాడు. తన ఇద్దరు అనుచరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని అయినా తన ప్లాన్‌లో ఎలాంటి మార్పూ లేదని ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. తన అనుచరులు 200 మంది ముంబయిలో సిద్ధంగా ఉన్నారని ధిల్లాన్ పేర్కొన్నాడు. సిక్కులకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరినీ తాను వదిలిపెట్టనంటూ హెచ్చరికలు చేసిన ధిల్లాన్.. అమితాబ్, అభేషేక్ బచ్చన్ పేర్లను ప్రస్తావించాడు. ‘వారు ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లను కట్టుకున్నా వదిలేది లేదు. వారిని కాల్చేస్తాం’ అన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు షూటర్లు వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.