Share News

సరిహద్దుల్లో జనాభా మార్పులపై అధ్యయనం

ABN , Publish Date - Jun 14 , 2026 | 03:42 AM

అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల దేశ సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం చేయాలని ..

సరిహద్దుల్లో జనాభా మార్పులపై అధ్యయనం

న్యూఢిల్లీ, జూన్‌ 13: అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల దేశ సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం చేయాలని నవ్లేకర్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశించారు. ఢిల్లీలో శనివారం ఉన్నత స్థాయి కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. సరిహద్దు ప్రాంతాలు, మెట్రో నగరాలు, పారిశ్రామిక పట్టణాలకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని కమిటీకి సూచించారు. జనాభా మార్పు అనేది ఒక ప్రాంతానికి పరిమితమైన సాధారణ ప్రక్రియ కాదని, దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, సామాజిక నిర్మాణం, గిరిజన సమాజ పరిరక్షణతో ముడిపడి ఉన్న అత్యంత తీవ్రమైన సమస్య అని నొక్కిచెప్పారు.

Updated Date - Jun 14 , 2026 | 03:42 AM