రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హోం మంత్రి అమిత్ షా భేటీ
ABN , Publish Date - Jun 25 , 2026 | 08:35 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చని ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ రాష్ట్రపతిని కలిశారు. ఈ నేపథ్యంలో నేడు అమిత్ షా కూడా రాష్ట్రపతితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయమన్న టాక్ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది.
జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టుల రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కేంద్ర కేబినెట్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి. మరోవైపు, కేంద్ర మంత్రులుగా ఉన్న కొందరు సీనియర్ నేతలకు రాష్ట్రాల పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీజేపీ అప్పగించింది. ఈ నేపథ్యంలో వీరు త్వరలోనే మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక రాబోయే పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, సామాజిక సమీకరణల ఆధారంగా కొత్త వారికి కేబినెట్‌లో చోటుదక్కే అవకాశం ఉంది. శివసేన (షిండే వర్గం), జేడీయూ వంటి కూటమి పక్షాల నుంచి అదనపు మంత్రి పదవుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల లోపే కేబినెట్ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసేలా మోదీ-షా ద్వయం కసరత్తు చేస్తునట్టు సమాచారం. జులై 20 వ తేదీ తరువాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
పాస్‌పోర్టు ఫీజులను పెంచిన కేంద్రం.. 14 ఏళ్లల్లో తొలిసారిగా..
భారత్‌లో 2030 నాటికి 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ