Share News

1,954 సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:15 AM

దేశ సరిహద్దుల వద్ద వలసలు, చొరబాట్లను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ జాగృతి కార్యక్రమం(వైబ్రెంట్‌ విలేజ్‌స్‌....

1,954 సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధి

నాథన్‌పూర్‌, ఫిబ్రవరి 20 : దేశ సరిహద్దుల వద్ద వలసలు, చొరబాట్లను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ జాగృతి కార్యక్రమం(వైబ్రెంట్‌ విలేజ్‌స్‌ ప్రోగ్రామ్‌)-2ను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం అసోంలో ప్రారంభించారు. పాకిస్థాన్‌, బంగ్లా సరిహద్దులకు ఆనుకొని ఉన్న దేశంలోని 17 రాష్ట్రాల్లోని 334 బ్లాకుల్లో ఉన్న 1,954 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పథకం కోసం కేంద్రం రూ.6,900 కోట్లు బడ్జెట్‌ కేటాయించినట్టు తెలిపారు. రెండో దశ కార్యక్రమంలో అసోంలోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న 140 గ్రామాలను ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ఇక, అసోంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సరిహద్దు భద్రతను పట్టించుకోలేదని, దాని వల్లే అసోంలో చొరబాట్లు పెరిగాయని అమిత్‌షా పేర్కొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:15 AM