Share News

రాహుల్‌ ద్వంద్వ పౌరసత్వంపై ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు

ABN , Publish Date - Apr 19 , 2026 | 05:26 AM

విపక్ష నేత రాహుల్‌ గాంధీ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను...

రాహుల్‌ ద్వంద్వ పౌరసత్వంపై ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 18: విపక్ష నేత రాహుల్‌ గాంధీ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను శనివారం అలహాబాద్‌ హైకోర్టు నిలిపివేసింది. ఆయన వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. రాహుల్‌ గాంఽధీకి బ్రిటన్‌ పౌరసత్వం కూడా ఉందంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ సుభాష్‌ విద్యార్థి.. కేసు నమోదు చేయాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంఽధించి ఓపెన్‌ కోర్టులోనే డిక్టేషన్‌ ఇచ్చారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన తీరుపై 2014లో ఇదే హైకోర్టుకు చెందిన ఫుల్‌ బెంచ్‌ తీర్పు ఆయన దృష్టికి రావడంతో ఉత్తర్వులను టైపు చేసి, సంతకం చేయడానికి ముందే స్టే ఇచ్చారు.

Updated Date - Apr 19 , 2026 | 05:26 AM