Share News

రాహుల్‌ పౌరసత్వ వివాదంపై రికార్డులు సమర్పించండి: అలహాబాద్‌ హైకోర్టు

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:48 AM

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వ వివాదానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం....

రాహుల్‌ పౌరసత్వ వివాదంపై రికార్డులు సమర్పించండి: అలహాబాద్‌ హైకోర్టు

లఖ్‌నవూ, మార్చి 9: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పౌరసత్వ వివాదానికి సంబంధించిన రికార్డులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సోమవారం అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ ఆదేశించింది. రాహుల్‌ గాంధీకి భారత పౌరసత్వంతో పాటు బ్రిటిష్‌ పౌరసత్వం కూడా ఉందని కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త ఎస్‌.విఘ్నేష్‌ శిశిర్‌ కేసు పెట్టారు. దీనిపై జస్టిస్‌ రాజీవ్‌ సింగ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. రాహుల్‌ గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ అందిన ఫిర్యాదులకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

Updated Date - Mar 10 , 2026 | 04:48 AM