హైకోర్టుకు సైకిళ్లపై 70 మంది జడ్జిలు
ABN , Publish Date - May 23 , 2026 | 03:56 AM
ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును శుక్రవారం లఖ్‌నవూలోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు....
లఖ్‌నవూ, మే 22: ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును శుక్రవారం లఖ్‌నవూలోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు అమలు చేశారు. సుమారు 70 మంది జడ్జీలు, ఇతర సిబ్బంది హైకోర్టుకు సైకిళ్లపై వెళ్లారు. ఈ యాత్రను ప్రధాన న్యాయమూర్తి రాజేశ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఆయన కూడా సైకిల్‌పైనే వెళ్లడం విశేషం. ఇంకొందరు ఈ-రిక్షాలపై హైకోర్టుకు వెళ్లారు. ఇంధనాన్ని పొదుపు చేసి, ప్రత్యామ్నాయ రవాణాను ఉపయోగించాలన్న సందేశాలతో సైకిళ్లకు ప్లకార్డులను అమర్చారు.