Share News

Low Floor Buses: అక్టోబరు నుంచి లో-ఫ్లోర్‌ సిటీ బస్సులు

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:19 AM

దేశవ్యాప్తంగా ఉన్న సిటీ బస్సుల్లో ఇకపై ప్రయాణం మరింత సులభతరం కానుంది. అక్టోబరు నుంచి తయారయ్యే అన్ని నగర బస్సులను తప్పనిసరిగా....

Low Floor Buses: అక్టోబరు నుంచి లో-ఫ్లోర్‌ సిటీ బస్సులు

  • బస్సుల తయారీ నిబంధనల్లో కేంద్రం మార్పులు

న్యూఢిల్లీ, జనవరి 18: దేశవ్యాప్తంగా ఉన్న సిటీ బస్సుల్లో ఇకపై ప్రయాణం మరింత సులభతరం కానుంది. అక్టోబరు నుంచి తయారయ్యే అన్ని నగర బస్సులను తప్పనిసరిగా ‘లో-ఫ్లోర్‌’ (తక్కువ ఎత్తు కలిగిన నేల) విధానంలోనే రూపొందించాలని కేంద్ర రవాణాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ ప్రకారం, 9 మీటర్లు అంతకంటే ఎక్కువ పొడవు ఉన్న నగర బస్సుల ఫ్లోర్‌ ఎత్తు నేల నుంచి 400 మి.మీ. మాత్రమే ఉండాలి. ఏప్రిల్‌ 1 నుంచి మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడళ్లకు, అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లకు అక్టోబరు 1నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం నగరాల్లో నడుస్తున్న అధిక ఎత్తు (హై-ఫ్లోర్‌) బస్సుల వల్ల వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఎత్తైన మెట్లు, ఇరుకైనదారులు ప్రయాణాన్ని భారంగా మారుస్తున్నాయి. లో-ఫ్లోర్‌ బస్సుల వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 04:19 AM