Share News

మహిళా కోటాకు మద్దతిస్తాం: అఖిలేశ్‌

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:09 AM

మహిళా రిజర్వేషన్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన తరగతుల ...

మహిళా కోటాకు మద్దతిస్తాం: అఖిలేశ్‌

లఖ్‌నవూ, ఏప్రిల్‌ 15: మహిళా రిజర్వేషన్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం స్పష్టం చేశారు. అయితే వెనుకబడిన తరగతుల మహిళలను పక్కనబెట్టడంతోపాటు కుల ఆధారిత జన గణనను తప్పించుకునే ‘రహస్య ఎజెండా’తో బీజేపీ దీనిని ముందుకు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ‘‘మేము మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తాం. కానీ ఒక కుట్రలో భాగంగా బీజేపీ మోసపూరిత చర్యను వ్యతిరేకిస్తాం. జనాభాలో గణనీయంగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించే విషయంలో అధికార పార్టీ, దాని మిత్రపక్షాలు మౌనంగా ఉంటున్నాయి’’ అని ఆయన ఆరోపించారు.

Updated Date - Apr 16 , 2026 | 03:09 AM