దేశ గౌరవాన్ని తగ్గించేలా నిరసనలా ?: అఖిలేశ్ యాదవ్
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:46 AM
ఏఐ సదస్సులో చొక్కాలు విప్పేసి యువజన కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేయడాన్ని ఇండియా కూటమిలోని పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఏఐ సదస్సులో చొక్కాలు విప్పేసి యువజన కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేయడాన్ని ఇండియా కూటమిలోని పార్టీలు కూడా తప్పుబడుతున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ యువజన కాంగ్రెస్ నేతల తీరును ఖండించారు. అధికార పార్టీ అయిన బీజేపీతో రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ విదేశీ ప్రతినిధుల ఎదుట దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఇలా నిరసన తెలియజేయడం తప్పు అని అఖిలేశ్ అన్నారు. బీజేపీ అసత్యాలు చెబుతోందని అందరికీ తెలుసు కానీ విదేశీయుల ముందు దేశాన్ని కించపరిచేలా యువజన కాంగ్రెస్ నేతలు ప్రవర్తించకుండా ఉండాల్సిందన్నారు. రాజకీయ పోరు కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టడం సరికాదని పశ్చిమ బెంగాల్ ఐటీ మంత్రి, టీఎంసీ నేత బాబుల్ సుప్రియో అన్నారు.