విమానంలో సీటు ఎంపికపై అదనపు చార్జీలకు బ్రేక్
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:31 AM
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ భారీ ఊరట కల్పించింది. విమానాల్లో కోరుకున్న సీటు కేటాయించడానికి విమానయాన సంస్థలు అదనంగా చార్జీలు విధించే పద్ధతికి బ్రేకులు వేసింది.
న్యూఢిల్లీ, మార్చి 18: విమాన ప్రయాణికులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ భారీ ఊరట కల్పించింది. విమానాల్లో కోరుకున్న సీటు కేటాయించడానికి విమానయాన సంస్థలు అదనంగా చార్జీలు విధించే పద్ధతికి బ్రేకులు వేసింది. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విమానాల్లో సీట్ల ఎంపికపై ఆ శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం... ఇకపై ఏ విమానంలో అయినా కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు విధించకుండా ప్రయాణికులకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణించే వారంతా వీలైనంత వరకూ ఒకేచోట కూర్చొనేలా సీట్లు కేటాయించాలని సూచించింది.