Share News

విమానాల సీట్లకు అదనపు చార్జీల రద్దు నిలిపివేత

ABN , Publish Date - Apr 03 , 2026 | 03:58 AM

విమానాల్లోని కనీసం 60 శాతం సీట్లకు అదనపు చార్జీలు వసూలు చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్టు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

విమానాల సీట్లకు అదనపు చార్జీల రద్దు నిలిపివేత

  • పౌర విమానయాన శాఖ ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: విమానాల్లోని కనీసం 60 శాతం సీట్లకు అదనపు చార్జీలు వసూలు చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్టు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదనపు చార్జీల నుంచి 60 శాతం సీట్లను మినహాయింపు ఇవ్వాలని మార్చి 18న పౌర విమానయాన శాఖ పేర్కొంది. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు 60 శాతం సీట్లకు దాన్ని వర్తింపజేయాలని సూచించింది. అలా చేస్తే నిర్వహణ, వాణిజ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. దాంతో తాత్కాలికంగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు విమానయాన శాఖ ప్రకటించింది.

Updated Date - Apr 03 , 2026 | 03:58 AM