డోప్ టెస్ట్‌లో ఎయిరిండియా పైలట్ విఫలం
ABN , Publish Date - Aug 10 , 2026 | 04:53 AM
గతవారం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైన ఘటన తర్వాత నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పైలట్ విఫలమైనట్లు సమాచారం.
న్యూఢిల్లీ, ఆగస్టు 9: గతవారం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం తీవ్రమైన కుదుపులకు గురైన ఘటన తర్వాత నిర్వహించిన డోప్ టెస్ట్‌లో పైలట్ విఫలమైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా యాజమాన్యం.. తుది నివేదిక అందలేదని, విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఇద్దరు పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు పేర్కొంది. ఆగస్టు 4న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో బయలుదేరిన ఎయిరిండియా విమానం అకస్మాత్తుగా సుమారు 300 అడుగల మేర ఎత్తును కోల్పోయి తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఘటనలో 13మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. దాదాపు 5నిమిషాల పాటు విమానం గాలిలో ఊగిసలాడింది. విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత నిబంధనల ప్రకారం పైలట్లకు పోస్ట్ ఫ్లైట్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలో పైలట్ ఇన్ కమాండ్‌కు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీని తర్వాత మరో సైకోయాక్టివ్ పరీక్షను కూడా నిర్వహించారు. దాని ఫలితాలు రావఆల్సి ఉంది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరుపుతోంది.