Air India Pilot Detained: విమానం బయలుదేరే ముందు ఎయిర్ ఇండియా పైలట్ మద్య సేవనం
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:00 AM
కెనడా నుంచి విమానం బయలుదేరడానికి ముందు మద్యం సేవించిన ఎయిర్ ఇండియా పైలట్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న కెనడా అధికారులు
న్యూఢిల్లీ, జనవరి 1: కెనడా నుంచి విమానం బయలుదేరడానికి ముందు మద్యం సేవించిన ఎయిర్ ఇండియా పైలట్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారణంగా రెండు గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. డిసెంబరు 23న కెనడాలోని వాంకోవర్ నుంచి వియన్నా మీదుగా ఢిల్లీ రావాల్సిన బోయింగ్ 777 విమానం పైలట్ ఈ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. వాంకోవర్ విమానాశ్రయంలోని డ్యూటీ ఫ్రీ షాపులో మద్యం బాటిల్ కొని తాగినట్టు అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగి ఒకరు గుర్తించారు. వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా, మద్యం తాగినట్టు తేలింది. మరో పైలట్ సాయంతో తొలుత ఆ విమానాన్ని వియన్నా తీసుకెళ్లారు. అక్కడ నుంచి విమానాని ఇంకో పైలట్ ఢిల్లీ తీసుకొచ్చారు.