Share News

గంజాయితో పట్టుబడ్డ ఎయిర్‌ఇండియా కోపైలట్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 06:13 AM

గంజాయి రవాణా చేస్తూ ఎయిర్‌ ఇండియా కోపైలట్‌ పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య నడిచే...

గంజాయితో పట్టుబడ్డ ఎయిర్‌ఇండియా కోపైలట్‌

  • భారత్‌కు తిప్పి పంపేసిన అమెరికా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: గంజాయి రవాణా చేస్తూ ఎయిర్‌ ఇండియా కోపైలట్‌ పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య నడిచే ఎయిర్‌ ఇండియా విమానంలో అదే సంస్థ కో-పైలట్‌.. ఈ నెల 14న ‘స్టాఫ్‌ ఆన్‌ డ్యూటీ’పై ప్యాసింజర్‌ క్యాబిన్‌లో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన ఆ విమానాన్ని నడుపాల్సి ఉంది. అయితే శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో కో-పైలట్‌ బ్యాగులో గంజాయి దొరికింది. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న అమెరికా అధికారులు.. తదుపరి విమానంలో భారత్‌కు పంపారు. ఈ విషయమై డీజీసీఏకు వివరణనిచ్చిన ఎయిర్‌ ఇండియా.. సదరు కోపైలట్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Updated Date - Apr 18 , 2026 | 06:13 AM