Share News

వెన్నెముక లోపాలకు కొత్త శస్త్రచికిత్స విధానం

ABN , Publish Date - May 04 , 2026 | 03:49 AM

తీవ్రమైన, సంక్లిష్టమైన వెన్నెముక వైకల్యాలతో బాధపడుతున్న రోగులకు చికిత్సకు సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఒక సరికొత్త శస్త్ర చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు.

వెన్నెముక లోపాలకు కొత్త శస్త్రచికిత్స విధానం

  • అభివృద్ధి చేసిన ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు

న్యూఢిల్లీ, మే 3: తీవ్రమైన, సంక్లిష్టమైన వెన్నెముక వైకల్యాలతో బాధపడుతున్న రోగులకు చికిత్సకు సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఒక సరికొత్త శస్త్ర చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇది వెన్నెముక వైకల్య చికిత్సలో కీలక మలుపుగా నిలవనుంది. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆర్థోపెడిక్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ భవుక్‌ గార్గ్‌ నేతృత్వంలోని వైద్య బృందం దాదాపు ఏడేళ్ల పాటు కృషి చేసి, ఈ నూతన సర్జికల్‌ టెక్నిక్‌ను అభివృద్ధి చేసింది. ఇది వెన్నెముక లోపాలతో బాధపడుతున్న, గతంలో పరిమిత చికిత్స ఎంపికలు ఉన్న, శస్త్రచికిత్స సమయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉన్న వారిలో కొత్త ఆశలు రేపుతోంది. ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంక్లిష్టమైన వెన్నెముక వైకల్య సవరణ పక్రియల్లో ఒకటిగా పరిగణించే పొస్టీరియర్‌ వెర్టెబ్రల్‌ కాలమ్‌ రీసెక్షన్‌ (పీవీసీఆర్‌)కు మెరుగుపరిచిన విధానమని ఎయిమ్స్‌ పేర్కొంది.

Updated Date - May 04 , 2026 | 03:49 AM