Share News

నర్సు నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలి!

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:26 AM

ఆస్పత్రి సిబ్బంది చూపిన తీవ్ర నిర్లక్ష్యం.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ మూడేళ్ల పసివాడి ప్రాణాలను బలిగొంది. భోపాల్‌లోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ ఆసుపత్రిలో...

నర్సు నిర్లక్ష్యానికి మూడేళ్ల చిన్నారి బలి!

  • సెలైన్‌ అనుకుని ప్రమాదకర రసాయనాన్ని ఎక్కించిన వైనం

న్యూఢిల్లీ, జూన్‌ 14: ఆస్పత్రి సిబ్బంది చూపిన తీవ్ర నిర్లక్ష్యం.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ మూడేళ్ల పసివాడి ప్రాణాలను బలిగొంది. భోపాల్‌లోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ ఆసుపత్రిలో బ్లడ్‌ క్యాన్సర్‌తో చికిత్స పొందుతున్న చిన్నారికి నర్సు పొరపాటున ప్రమాదకరమైన రసాయనం ఎక్కించడంతో నిమిషాల్లోనే కన్నుమూశాడు. ఈ దారుణమైన ఘటన డిసెంబర్‌, 2025లో జరగగా ఆసుపత్రి అంతర్గత విచారణ అనంతరం తాజాగా ఇద్దరు నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాకు చెందిన సిద్ధార్థ్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన కుమారుడు సార్థక్‌ను.. క్యాన్సర్‌ వ్యాధి చికిత్స కోసం డిసెంబర్‌ 15న ఎయిమ్స్‌ పీడియాట్రిక్‌ వార్డులో చేర్చాడు. పరీక్షించిన వైద్యులు మరుసటి రోజు బోన్‌మ్యారో బయాప్సీ పరీక్ష చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ పరీక్షలో బయాప్సీ నమూనాలను భద్రపరిచేందుకు వాడే ‘ఫార్మలిన్‌’ అనే ప్రమాదకర రసాయనాన్ని ఓ నర్సు సిరంజిలో నింపి వార్డులోకి తెచ్చి అక్కడే మర్చిపోయింది. మరుసటి రోజు మరో నర్సు అక్కడే టేబుల్‌పై ఉన్న ఆ సిరంజిని సైలెన్‌లో ఇవ్వాల్సిన ఇంజక్షన్‌ అనుకుని బాబుకు ఎక్కించింది.

Updated Date - Jun 15 , 2026 | 03:26 AM