Share News

మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా

ABN , Publish Date - May 27 , 2026 | 03:58 AM

అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీకి చెందిన మరో రెబల్‌ ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

మరో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాజీనామా

చెన్నై, మే 26(ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీకి చెందిన మరో రెబల్‌ ఎమ్మెల్యే ఇసక్కి సుబ్బయ్య మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అయితే, అది టైప్‌ చేసిన లేఖ కావడంతో స్పీకర్‌ తిరస్కరించారు. ఆ వెంటనే ఎమ్మెల్యే తన స్వహస్తాలతో మరో లేఖ రాసి స్పీకర్‌కు అందజేయగా ఆమోదించారు. తర్వాత సుబ్బయ్య టీవీకేలో చేరారు. దీంతో, టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 4కు పెరిగింది. అయితే, అన్నాడీఎంకే రెబల్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, వెంటనే తమ పార్టీలోకి చేర్చుకుంటున్న టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌ తీరును మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ, వీసీకే ఖండించాయి. ఇలాంటి చర్యలను తాము సమర్థించబోమన్నాయి.

Updated Date - May 27 , 2026 | 03:58 AM