Share News

అహ్మదాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:56 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో...

అహ్మదాబాద్‌ మెట్రో విస్తరణకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, జూన్‌ 10: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో ఫేజ్‌2(ఏ) కింద 6.032 కిమీల మేర రైల్వే లేన్లను విస్తరించనున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్‌ ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,169.04కోట్లుగా నిర్ణయించారు. అహ్మదాబాద్‌లోని కీలక వాణిజ్య హబ్‌లను కలుపుతూ విస్తరణ జరగనుంది. ఫేజ్‌2(ఏ) విస్తరణలో 4ఎలివేటెడ్‌ స్టేషన్లు, ఒక భూగర్భ స్టేషన్‌ ఉండనున్నాయి. విస్తరణ పనులు పూర్తయ్యి..మెట్రో సేవలు ప్రారంభమైతే అహ్మదాబాద్‌- గాంధీనగర్‌ మెట్రో కారిడార్‌ పరిధి 77.63 కిమీలకు పెరగనుంది.

Updated Date - Jun 11 , 2026 | 03:56 AM