Haryana Couple Welcomes a Son: వారసుడి కోసం..
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:06 AM
ఒకరు లేదా ఇద్దరు చాలు అని నేటి తరం దంపతులు సంతా నం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటే.. హరియాణాకు చెందిన సంజయ్-సునీత దంపతులు....
10 మంది ఆడపిల్లల తర్వాత 11వ కాన్పులో మగ బిడ్డ
న్యూఢిల్లీ: ఒకరు లేదా ఇద్దరు చాలు అని నేటి తరం దంపతులు సంతా నం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటే.. హరియాణాకు చెందిన సంజయ్-సునీత దంపతులు మాత్రం ఏకంగా 11 మందికి జన్మనిచ్చారు. 19 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట మగపిల్లాడి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 10 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చిన సునీత ఎట్టకేలకు ఇటీవల 11వ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కొడుకుతో సహా తమ పిల్లలందరినీ ఒకేరకంగా చూసుకుంటామని ఆ దంపతులు విలేకరులతో అన్నారు.