ఫుడ్ ఆర్డర్లకు నగదు చెల్లిస్తే అదనపు ఫీజు
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:17 AM
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా ఆహారాన్ని సరఫరా చేసే జొమోటో సంస్థ శనివారం నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. చేసిన ఆర్డర్లకు నగదు చెల్లిస్తే అదనపు ఫీజు వసూలు చేయనున్నట్టు యాప్‌లో పేర్కొంది.
జొమాటో కొత్త రూల్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా ఆహారాన్ని సరఫరా చేసే జొమోటో సంస్థ శనివారం నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. చేసిన ఆర్డర్లకు నగదు చెల్లిస్తే అదనపు ఫీజు వసూలు చేయనున్నట్టు యాప్‌లో పేర్కొంది. క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆర్డర్లకు బిల్లుతో పాటు ‘పే ఆన్ డెలివరీ’ ఫీజు ఉంటుందని తెలిపింది. ఆన్‌లైన్ చెల్లింపులకు కాకుండా, నగదు చెల్లింపులకే ఇది వర్తిస్తుంది. ఆర్డరు విలువ, లొకేషన్, ఇతర అంశాల ఆధారంగా ఈ ఛార్జీలు ఉంటాయి. ప్రత్యర్థి అయిన స్విగ్గీ మాత్రం ప్రస్తుతానికి నగదు చెల్లింపులపై ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు.