Share News

మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై దాడి

ABN , Publish Date - May 31 , 2026 | 04:52 AM

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్‌పూర్‌లో ...

మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీపై దాడి

  • రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరిన మూక

కోల్‌కతా, మే 30: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై దాడి జరిగింది. దక్షిణ 24 పరగణాల జిల్లా సొరేన్‌పూర్‌లో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా కొందరు ఆయన్ను దొంగ-దొంగ అని అరుస్తూ నినాదాలు చేశారు. మరికొందరు ఆయనపై భౌతికంగా దాడి చేయడంతో పాటు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. చొక్కాను చించివేశారు. పోలీసులు ఎట్టకేలకు ఆయనకు హెల్మెట్‌ పెట్టి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం ఆయన కోల్‌కతా అపోలో ఆస్పత్రిలో చేరారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపాలనుకుంటున్నారని, అందుకే కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు.దాడిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. ఘటనపై మమతా బెనర్జీ స్పందిస్తూ పాలకులే హంతకులయ్యారని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, అభిషేక్‌ బెనర్జీపై దాడి ఘటనతో తమకు సంబంధం లేదని బీజేపీ తెలిపింది.

Updated Date - May 31 , 2026 | 04:52 AM