Share News

సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కేకు బెయిల్‌

ABN , Publish Date - Oct 18 , 2026 | 06:12 AM

కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కేకు ఢిల్లీలోని స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

సీజేపీ కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కేకు బెయిల్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 17: కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ) కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కేకు ఢిల్లీలోని స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు శనివారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ‘లెహ్రాదో తిరంగా’ కార్యక్రమానికి బయలుదేరుతుండగా శక్రవారం ఆయనను ఝందేవాలా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా.. రూ.50 వేల పూచీకత్తుతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని సంతకం చేసిన బాండును తీసుకొని బెయిల్‌ మంజూరు చేశారు. దీంతో మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆయనను పోలీసులు విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా, యూట్యూబర్‌ ధృవ్‌రాఠీ లండన్‌లోని పార్లమెంట్‌ స్క్వేర్‌ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆదివారం నిరసనకు పిలుపునిచ్చారు. సర్‌కు వ్యతిరేకంగా ఈ నెల 10 నిర్వహించిన నిరసనల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ధృవ్‌ రాఠీ లండన్‌ వెళ్లిపోయారు. ‘‘ఇప్పుడే లండన్‌ చేరుకున్నాను. ఓటు చోరీ, ప్రజాస్వామ్యం హత్యకు సంబంధించిన వాస్తవాలను ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చింది’’అని ఎక్స్‌పై చేసిన వీడియో పోస్టులో రాఠీ పేర్కొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 06:12 AM