Share News

ఆప్‌ కార్యాలయం అడ్రసుతో 58 డొల్ల కంపెనీలు

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:35 AM

న్యూఢిల్లీలోని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం చిరునామాపై గుర్తు తెలియని 58 డొల్ల కంపెనీలు నమోదయినట్టు మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించింది.

ఆప్‌ కార్యాలయం అడ్రసుతో   58 డొల్ల కంపెనీలు
aap

బీజేపీ కుట్రేనని పోలీసులకు ఫిర్యాదు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: న్యూఢిల్లీలోని తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయం చిరునామాపై గుర్తు తెలియని 58 డొల్ల కంపెనీలు నమోదయినట్టు మంగళవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆరోపించింది. నెంబరు-1 కానింగ్‌ లేన్‌ అడ్రసుపై ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో ఈ కంపెనీలు రిజిస్టరయినట్టు ఆప్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. దీనిపై పోలీసులు, జీఎస్టీ ప్రిన్సిపల్‌ కమిషనర్‌లకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమపై దుష్ప్రచా రం చేసేందుకు బీజేపీయే ఈ కుట్ర పన్నిందన్నారు.

Updated Date - Sep 23 , 2026 | 05:36 AM