ఆధార్ కార్డుపై ఫొటో, క్యూఆర్ కోడ్ మాత్రమే!
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:53 AM
ఆధార్ కార్డు స్వరూపం మారబోతోంది. ఉడాయ్ ఈమేరకు కార్డు డిజైన్‌ను పూర్తిగా మార్చబోతోంది. పలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఆధార్ కార్డు స్వరూపం మారబోతోంది. ఉడాయ్ ఈమేరకు కార్డు డిజైన్‌ను పూర్తిగా మార్చబోతోంది. పలు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కార్డుపై కార్డుదారుని ఫొటో, క్యూఆర్ కోడ్‌లు మాత్రమే ఉంటాయి. ఆధార్ ఆధారంగా జరుగుతున్న నేరాలు... సిమ్ కార్డు మోసాలు, అనధికారిక రుణాలు, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా నగదు తీసుకోవడం వంటి వాటిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉడాయ్ ఈమార్పులు తీసుకువస్తున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక నిర్ధారణ ఏదీ లేదు. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఆధార్ యాప్‌లోని ఫీచర్లను పరిశీలిస్తే ఈ విషయం సూచనా ప్రాయంగా అర్థమవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్‌లో సంబంధిత వ్యక్తి పూర్తి సమాచారం ఉంటుంది.