Share News

84 ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత..

ABN , Publish Date - Jun 02 , 2026 | 07:08 AM

84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం.

84 ఏళ్ల వృద్ధుడికి ఊహించని షాక్.. 33 ఏళ్ల తర్వాత..
84-year-old convicted

పాట్నా, జూన్ 2: 84 ఏళ్ల ఓ వృద్ధుడికి ఊహించని షాక్ తగిలింది. హత్యాయత్నం కేసులో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 33 ఏళ్ల తర్వాత ఆ వృద్ధుడిని కోర్టు దోషిగా తేల్చటం గమనార్హం. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1992 నవంబర్ 10వ తేదీన వైశాలి జిల్లా, రాఘవ్‌పూర్ గ్రామానికి చెందిన దీప్ రాయ్, ఆయన కుటుంబసభ్యులు అదాలత్ రాయ్ ఇంటి దగ్గర ఉన్న రోడ్డుపై గాజు పెంకులు పేర్చారు.


అదాలత్ రాయ్, ఆయన భార్య రామ్‌శకీ దేవి.. ‘రోడ్డుపై గాజు పెంకులు ఎందుకు పేరుస్తున్నారు’ అని దీప్ రాయ్ కుటుంబాన్ని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన దీప్ రాయ్ కుటుంబం అదాలత్ రాయ్ దంపతులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 1993, మార్చి 13వ తేదీన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 1999 జూన్ నెలలో కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. దాదాపు 30 ఏళ్ల నుంచి కోర్టులో కేసు విచారణ జరుగుతూనే ఉంది. నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. కోర్టు పది మంది సాక్ష్యులను విచారించింది.


ఆధారాలను రివ్యూ చేసిన తర్వాత కోర్టు తుది తీర్పును వెలువరించింది. 84 ఏళ్ల దీప్ రాయ్‌ని దోషిగా తేల్చింది. జూన్ 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈ రోజు దీప్ రాయ్‌కి శిక్ష ఖరారు చేయనుంది. 84 ఏళ్ల దీప్ రాయ్ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీప్ రాయ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సరిగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందో వేచి చూడాలి.


ఇవి కూడా చదవండి

సీబీఎస్ఈ జవాబుపత్రాలు ఫోన్లతో స్కానింగ్‌

6న భారత్‌కు ‘కాక్రోచ్‌’ అధినేత

Updated Date - Jun 02 , 2026 | 07:14 AM