8 Jawans Injured in Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..8 మంది జవాన్లకు గాయాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:50 AM
జమ్మూకశ్మీర్ కిశ్త్‌వాడ్ జిల్లా సొన్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది జవాన్లు గాయపడ్డారు. జైష్ ఎ మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న సైనికులు....
శ్రీనగర్, జనవరి 18: జమ్మూకశ్మీర్ కిశ్త్‌వాడ్ జిల్లా సొన్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది జవాన్లు గాయపడ్డారు. జైష్ ఎ మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందుకున్న సైనికులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరోవైపు, పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. భారత్-పాక్ సరిహద్దుకు సమీపంలోని నరోత్ జైమల్ సింగ్ ప్రాంతంలో పఠాన్‌కోట్ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మూడు ఏకే-47 రైఫిళ్లు, ఐదు మ్యాగజీన్లు, టర్కీ, చైనా దేశాలలో తయారైన రెండు పిస్టళ్లు, వాటికి సంబంధించిన రెండు మ్యాగజీన్లు, 98 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోకి క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశీ నిధులు తరలిస్తున్నారని భద్రతా సంస్థలు గుర్తించాయి.