Share News

కర్ణాటకలో మందారపువ్వు మింగి బాలుడి మృతి

ABN , Publish Date - Mar 31 , 2026 | 04:51 AM

ఆరు నెలల బాలుడు ఆడుకుంటూ మందార పువ్వును మింగి, శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా దొడ్డహెజ్జూరు ...

కర్ణాటకలో మందారపువ్వు మింగి బాలుడి మృతి

బెంగళూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ఆరు నెలల బాలుడు ఆడుకుంటూ మందార పువ్వును మింగి, శ్వాస ఆడక మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా దొడ్డహెజ్జూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. నవ్య, సుదర్శన్‌ దంపతుల రెండో కుమారుడు చిన్మయి గౌడ(6 నెలలు) శనివారం తన అన్నతో కలసి ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో పూజకు పెట్టిన మందారం పువ్వును తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. పువ్వును తన అన్న లాగేస్తాడని భావించి..మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడలేదు. తల్లిదండ్రులు వెంటనే హణగోడిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మైసూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. కానీ, చికిత్స ఫలించక బాలుడు మృతి చెందాడు.

Updated Date - Mar 31 , 2026 | 04:51 AM