అబుదాబి నుంచి బెంగళూరుకు 510 మంది
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:25 AM
అబుదాబి నుంచి రెండు విమానాలలో 510 మంది భారతీయులు బెంగళూరుకు చేరుకున్నారు. వీరిలో 210మంది కన్నడిగులు ఉన్నారు...
విమానాల పునరుద్ధరణతో స్వదేశానికి రాక
బెంగళూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): అబుదాబి నుంచి రెండు విమానాలలో 510 మంది భారతీయులు బెంగళూరుకు చేరుకున్నారు. వీరిలో 210మంది కన్నడిగులు ఉన్నారు. యుద్ధం కారణంగా పశ్చిమ ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలతో విమాన సర్వీసులు రెండు రోజులపాటు నిలిపివేయడంతో దుబాయ్, గల్ఫ్ దేశాల్లో భారతీయులు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు సోమవారం నుంచి పునరుద్ధరించడంతో భారతీయుల రాక మొదలైంది. బెంగళూరుకు సోమవారం రాత్రి, మంగళవా రం తెల్లవారుజామున ఒక్కో విమానం వచ్చాయి. మొదటి విమానంలో210, రెండో విమానంలో 300 మంది వచ్చారు.