Share News

50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:50 AM

దేశ పౌర విమానయాన రంగంలో భద్రతా లోపాలపై పార్లమెంటరీ ప్యానెల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని దాదాపు 50 శాతం వాణిజ్య విమానాల్లో..

50 శాతం వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు

  • దేశంలోని 754 విమానాల్లో ఆడిటింగ్‌..

  • 377 విమానాల్లో సాంకేతిక లోపాలు

న్యూఢిల్లీ, మార్చి 27: దేశ పౌర విమానయాన రంగంలో భద్రతా లోపాలపై పార్లమెంటరీ ప్యానెల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని దాదాపు 50 శాతం వాణిజ్య విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నట్లు వెల్లడించింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 754 విమానాల్లో ఆడిట్‌ చేయగా.. 377 విమానాల్లో పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు బయటపడినట్లు పౌర విమానయాన స్టాండింగ్‌ కమిటీ నివేదించింది. గత నెల 3వ తేదీ వరకు ఇండిగోలోని 405 విమానాల్లో ఆడిట్‌ చేయగా..148 విమానాల్లో లోపాలున్నాయని తేలినట్లు వెల్లడించింది. అలాగే ఎయిరిండియాకు చెందిన 137, ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌సకు చెందిన 54 విమానాల్లోనూ ఈ లోపాలు బయటపడినట్లు తెలిపింది.

Updated Date - Mar 28 , 2026 | 04:50 AM