Share News

ఆధారం లేకుండా ఆరోపణలా?

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:42 AM

ఎస్‌ఐఆర్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న వేళ..

ఆధారం లేకుండా ఆరోపణలా?

  • రాజ్యాంగ సంస్థలను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు

  • సర్‌పై ఈసీకి మద్దతుగా 42 మంది రిటైర్డ్‌ జడ్జీల లేఖ

న్యూఢిల్లీ, అక్టోబరు 8: ఎస్‌ఐఆర్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న వేళ.. ఎన్నికల సంఘం నిర్ణయాలను సమర్థిస్తూ 42 మంది విశ్రాంత న్యాయమూర్తులు బహిరంగ లేఖ రాశారు. సర్‌ విషయంలో ఈసీ అన్ని నిర్ణయాలూ చట్టబద్ధంగానే తీసుకుందని గురువారం విడుదల చేసిన లేఖలో వారు పేర్కొన్నారు. తాము ఏ పార్టీనీ సమర్థించటం లేదని స్పష్టంచేశారు. కానీ, ఆధారాలు లేకుండా రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. రాజ్యాంగ సంస్థలు ప్రస్తుతం తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నాయని, వాటిని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ లేఖపై పలువురు సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, హైకోర్టుల రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు సంతకాలు చేశారు.

Updated Date - Oct 09 , 2026 | 04:43 AM