Share News

40శాతం విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరత

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:55 AM

ఎల్‌నినోతో అసాధారణ వేడి వాతావరణం కారణంగా విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరగడంతో దేశవాప్యంగా 40 శాతం థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు అత్యంత తక్కువ నిల్వలతో నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి

40శాతం విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు కొరత
coal

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ఎల్‌నినోతో అసాధారణ వేడి వాతావరణం కారణంగా విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరగడంతో దేశవాప్యంగా 40 శాతం థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు అత్యంత తక్కువ నిల్వలతో నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈనెల 19 నాటికి అత్యంత తక్కువ బొగ్గు నిల్వలున్న ప్లాంట్ల సంఖ్య 74కి చేరిందని కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ (సీఈఏ) నివేదిక వెల్లడించింది. వారం క్రితం ఈ సంఖ్య 60 ప్లాంట్లుగా ఉంది. ఇక ఆయా ప్లాంట్లలో అవసరమైన నిల్వల కంటే 25 శాతం తక్కువ బొగ్గు లేదా మూడు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది.

Updated Date - Sep 22 , 2026 | 04:59 AM