Share News

భారత్‌ నుంచి చైనా దాకా 4000కి.మీ. మేఘమాల

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:27 AM

భారత ఉపఖండంలోని పలు రాష్ట్రాల నుంచి.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ మీదుగా చైనా దాకా.. 4000 కిలోమీటర్ల మేర విస్తరించిన మేఘమాల తాలూకూ ఉపగ్రహ ఛాయాచిత్రమిది!

భారత్‌ నుంచి చైనా దాకా 4000కి.మీ. మేఘమాల
meghamala

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: భారత ఉపఖండంలోని పలు రాష్ట్రాల నుంచి.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ మీదుగా చైనా దాకా.. 4000 కిలోమీటర్ల మేర విస్తరించిన మేఘమాల తాలూకూ ఉపగ్రహ ఛాయాచిత్రమిది! బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ తీరాన్ని తాకుతున్న సమయంలో భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఇది కనిపించింది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ దశలోకి ప్రవేశిస్తున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల వల్ల విస్తారంగా తేమ చేరి ఈ మేఘమాల ఏర్పడినట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఈ మేఘాల వరుస విస్తరించిన ప్రాంతాల్లో (తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాలతోపాటు.. బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనాల్లో) పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు.

Updated Date - Sep 26 , 2026 | 05:27 AM