Maoist encounter: ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఘటన.. తప్పించుకున్న పాపారావు?
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:37 AM
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం నక్సల్స్-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగు...
చర్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం ఉదయం నక్సల్స్-భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా వాయవ్య అడవుల్లో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు, ఆయన బృందం సభ్యులున్నట్టు అందిన సమాచారంతో డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఇదే క్రమంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు సహా నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మృతుల్లో నేషనల్ పార్కుఏరియా కమిటీ డీవీసీఎం సభ్యుడు దిలీప్ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ నాయకుడు పాపారావు ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. కాగా, కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాపారావు భార్య ఊర్మిళ (పామేడు ఏరియా కమిటీ కార్యదర్శి) మృతి చెందారు.