భవిష్యత్తుపై విద్యార్థుల బెంగ..!
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:57 AM
దేశంలోని దాదాపు 39శాతం విద్యార్థులు తమ చదువులు స్థిరమైన ఉద్యోగాలను ఇస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు.
సుస్థిర ఉద్యోగంపై 39శాతం మందిలో ఆందోళన
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సర్వేలో గుర్తింపు
న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలోని దాదాపు 39శాతం విద్యార్థులు తమ చదువులు స్థిరమైన ఉద్యోగాలను ఇస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ భయమే విద్యార్థుల్లో మానసిక క్షోభ, తీవ్ర ఒత్తిడికి కారణం అవుతోందని సుప్రీం కోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టీఎఫ్) గుర్తించింది. మారుతున్న సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), విద్యా విధానాల మధ్య పెరుగుతున్న అంతరాల వల్ల విద్యార్థుల్లో భవిష్యత్తుపై భయాలు వ్యక్తమవుతున్నాయని టాస్క్ ఫోర్స్ నివేదిక వెల్లడించింది. దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో వారి మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించాలని కోరుతూ.. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ప్యానెల్ ఒక సర్వే చేపట్టింది. ఉన్నత విద్యా సంస్థల్లో చదువుతున్న మొత్తం 2.43 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 39ు మంది.. తాము చదివిన చదువులకు సుస్థిరమైన ఉద్యోగాలు లభిస్తాయో లేదోనని ఆందోళన వ్యక్తం చేసినట్టు గుర్తించారు.