Share News

పాక్‌లో చొరబాటుకు యత్నించిన ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:15 AM

నియంత్రణ రేఖను అక్రమంగా దాటి పాకిస్థాన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం సైన్యం అరెస్టు చేసింది. దురుద్దేశాలతో...

పాక్‌లో చొరబాటుకు యత్నించిన ముగ్గురి అరెస్టు

శ్రీనగర్‌, డిసెంబరు 31: నియంత్రణ రేఖను అక్రమంగా దాటి పాకిస్థాన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం సైన్యం అరెస్టు చేసింది. దురుద్దేశాలతో పాక్‌కు బయలుదేరారంటూ స్పష్టమైన సమాచారం అందడంతో చీనార్‌ కార్ప్స్‌ సైనికులు, జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు ఆపరేషన్‌ నిర్వహించి బారాముల్లా జిల్లా యురి సెక్టారులో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు సోపోర్‌కు చెందిన వారు కాగా, మరో వ్యక్తి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి వచ్చిన చొరబాటుదారు కావడం గమనార్హం.

Updated Date - Jun 01 , 2026 | 05:15 AM