Share News

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:39 AM

జమ్మూకశ్మీర్‌లోని కిస్త్వాడ్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వారు పాకిస్థాన్‌కు చెందిన జైష్‌...

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌, ఫిబ్రవరి 22: జమ్మూకశ్మీర్‌లోని కిస్త్వాడ్‌ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. వారు పాకిస్థాన్‌కు చెందిన జైష్‌ ఎ మహమ్మద్‌ (జేఈఎం) తరఫున పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన మట్టి ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న కచ్చితంగా సమాచారం అందుకున్న భద్రతాబలగాలు ఆపరేషన్‌ ట్రాషి-ఐ పేరుతో అత్యంత సాహసంతో గాలింపు చేపట్టాయి. తొలుత ఉగ్రవాదులు కాల్పులు జరపగా, జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. మృతి చెందిన వారిలో కరుడుగట్టిన ఉగ్రవాది, జేఈఎం కమాండర్‌ సైఫుల్లా ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 01:39 AM