Share News

భారత నావికులున్న మరో నౌకపై అమెరికా దాడి

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:00 AM

భారతీయ సిబ్బందితో వెళ్తున్న మరో వాణిజ్య నౌకపై ఒమన్‌ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసింది. నాలుగు రోజుల క్రితమే మారివెక్స్‌ అనే నౌకపై దాడి చేయగా...

భారత నావికులున్న మరో నౌకపై అమెరికా దాడి

  • నౌకలో 24మంది భారతీయ సిబ్బంది..ముగ్గురు గల్లంతు

న్యూఢిల్లీ, జూన్‌ 10: భారతీయ సిబ్బందితో వెళ్తున్న మరో వాణిజ్య నౌకపై ఒమన్‌ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసింది. నాలుగు రోజుల క్రితమే మారివెక్స్‌ అనే నౌకపై దాడి చేయగా, అందులోని 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం అదే ప్రాంతంలో పలావు దేశ పతాకంతో వెళ్తున్న సెట్టిబెల్లో అనే కెమికల్‌, ఆయిల్‌ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం దాడి చేసింది. దీంతో నౌక ఇంజన్‌ వైపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నౌకలోనూ 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా, దాడి తర్వాత 21 మందిని ఒమన్‌ తీర రక్ష క దళం కాపాడింది. ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వాణిజ్య నౌకలపై దాడులు ఆపాలని విదేశాంగశాఖ ఒక ప్రకటనలో కోరింది. అమెరికా దౌత్యవేత్త జేసన్‌ మీక్స్‌ను పిలిపించి నిరసన తెలిపినట్లు వెల్లడించింది.

Updated Date - Jun 11 , 2026 | 04:00 AM