Maoists surrender: 26 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:38 AM
ఛత్తీస్‌గఢ్లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్‌చవాన్ ఎదుట బుధవారం 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండగా, అందరిపై సుమారు...
చర్ల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్‌చవాన్ ఎదుట బుధవారం 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండగా, అందరిపై సుమారు రూ.64 లక్షల రివార్డు ఉంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత్.. మావోయిస్టులు లేని దేశంగా మారుతోందని, బర్సె దేవా లొంగుబాటు తరువాత మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనమైందని అన్నారు. అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు జరుగుతున్న నేపథ్యంలో ఇతర మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు. బుధవారం లొంగిపోయిన వారిలో మాడ్ డివిజన్, పీఎల్‌జీఏ, సభ్యులున్నారని తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద నగదు అందజేశామని చెప్పారు.