Share News

2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:32 AM

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతం నుంచి ఫిబ్రవరి 28 తర్వాత సుమారు 2.6 లక్షల మంది భారత పౌరులు...

2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి

న్యూఢిల్లీ, మార్చి 18: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఆ ప్రాంతం నుంచి ఫిబ్రవరి 28 తర్వాత సుమారు 2.6 లక్షల మంది భారత పౌరులు స్వదేశానికి చేరుకున్నారని కేంద్రం తెలిపింది. యుద్ధ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్‌) అసీమ్‌ ఆర్‌. మహాజన్‌ మాట్లాడారు. యూఏఈలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌కు 70 విమాన సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. ఖతార్‌ గగనతలం పాక్షికంగా తెరిచే ఉందన్నారు. మంగళవారం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ భారత్‌కు 5 విమానాలు నడిపిందని, బుధవారం 9 సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించిందని చెప్పారు. కువైత్‌ గగనతలం ఫిబ్రవరి 28 నుంచి మూతపడే ఉందన్నారు. కొన్ని దేశాల్లో విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ, మొత్తమ్మీద విమాన ప్రయాణాల పరిస్థితి మెరుగుపడుతోందన్నారు.

ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 19 , 2026 | 06:33 AM