Share News

బీజాపూర్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:52 AM

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం 25 మంది మావోయిస్టులు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ఎదుట లొంగిపోయారు.

బీజాపూర్‌లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌ జిల్లాలో మంగళవారం 25 మంది మావోయిస్టులు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ ఎదుట లొంగిపోయారు. వీరంతా దండకాకరణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యులు. లొంగిపోయిన వారిలో 12మంది మహిళలుండగా, వీరందరిపై కలిపి మొత్తం రూ.1.47 కోట్ల రివార్డు ఉంది. వీరి నుంచి 93 తుపాకులు, రూ.2.90కోట్ల నగదు, 7.20కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ మాట్లాడుతూ.. వీరి లొంగుబాటుతో దండకారణ్య కమిటీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినట్టేనన్నారు. కేంద్రం విధించిన మార్చి 31 నాటికి దేశం మావోయిస్టులు లేని ప్రాంతంగా మారిందన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 04:52 AM