Share News

డీఎంకే పాలనలోనే ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు

ABN , Publish Date - Jun 23 , 2026 | 02:09 AM

గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే తమిళనాడు నుంచి అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి కీర్తన వెల్లడించారు.

డీఎంకే పాలనలోనే ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు

  • తమిళనాడు అసెంబ్లీలో పరిశ్రమల శాఖ మంత్రి కీర్తన వెల్లడి

చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): గత డీఎంకే ప్రభుత్వ హయాంలోనే తమిళనాడు నుంచి అనేక పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి కీర్తన వెల్లడించారు. ఆయా పరిశ్రమల జాబితాను సభ ముందు ఉంచారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని విపక్ష నేత ఉదయనిధి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. గత ఐదేళ్ల కాలంలో 25 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయని, దీంతో రూ.3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 2.03 లక్షల ఉపాధి అవకాశాలను రాష్ట్రం కోల్పోయిందని తెలిపారు.

Updated Date - Jun 23 , 2026 | 02:09 AM