భారతీయ నావికులను కాపాడండి
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:10 AM
అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 23వేల మంది భారతీయ నావికులను రక్షించి, క్షేమంగా తరలించాలని నావికుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ముంబై, ఫిబ్రవరి 6: అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 23వేల మంది భారతీయ నావికులను రక్షించి, క్షేమంగా తరలించాలని నావికుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎ్‌సయూఐ) నేతలు గురువారం ముంబైలో నౌకాయాన విభాగం డైరెక్టర్ జనరల్ శ్యాం జగన్నాథన్‌ను కలిశారు. దాడుల్లో మృతిచెందిన నావికుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. గతవారం యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ భారత నౌకలు లేదా భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై తొమ్మిది దాడులు జరిగాయని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. తాజాగా మార్చి 5న సోనాంగోల్ నమీబే నౌకపై దాడి జరిగింది. అందులో 10 మంది భారతీయులు ఉన్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారతీయ జెండా ఉన్న 36 నౌకలు ఉన్నాయి.