ఆ 22 నౌకలొస్తే ఇంధన కష్టాలు తీరినట్లే!
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:52 AM
హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆ 22 నౌకలు దేశంలోకి వస్తే వాటిలోని 2.15లక్షల టన్నుల లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), 3.21లక్షల టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్...
న్యూఢిల్లీ, మార్చి 19: హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆ 22 నౌకలు దేశంలోకి వస్తే వాటిలోని 2.15లక్షల టన్నుల లిక్విడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ), 3.21లక్షల టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), 16.76 లక్షల టన్నుల ముడిచమురు ఇక్కడకు చేరుకుంటే... దేశంలో ఇంధన కష్టాలు దాదాపుగా తీరినట్లే. మన దేశానికి ఎల్‌ఎన్‌జీ, ఎల్పీజీ, ముడి చమురు తరలిస్తున్న స్వదేశీ, విదేశాలకు చెందిన 22 నౌకలు హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి ఉన్నాయి. ఈ నౌకలే ఇప్పుడు భారత ఇంధన భద్రతకు ఎంతో కీలకమైనవిగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వీటిని హోర్ముజ్ జలసంధి నుంచి సురక్షితంగా తీసుకురావడానికి షిప్పింగ్, నౌకాయాన శాఖ, డైరక్టరేట్ ఆఫ్ నావల్, పెట్రోలియం, సహజవాయువు శాఖ తదితర విభాగాలు సంయుక్తంగా సంప్రదింపులు జరుపుతున్నాయి.